Skip to main content

కశ్మీర్ యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలు


కశ్మీర్: మార్కెట్లోకి కొత్త కశ్మీర్ యాపిల్ పండ్లు వచ్చాయి. వ్యాపారులు వాటిని కొనుగోలు చేశారు. బాక్సులు ఓపెన్ చేసి... ఒక్కసారిగా షాక్ అయ్యారు. పండ్లపై భారత్ వ్యతిరేక నినాదాలు బ్లాక్ స్కెచ్‌తో రాసి ఉండటమే దీనికి కారణం. కశ్మీర్‌లోని కథువా హోల్‌సేల్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై వ్యాపారులు మార్కెట్ ఎదుట నిరసనకు దిగారు. పండ్లపై ‘బుర్హాన్ వనీ’, ‘పాకిస్థాన్ జిందాబాద్’, ‘గో బ్యాక్ ఇండియా’ నినాదాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మార్కెట్ ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా.. చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Comments