Skip to main content

వారు మీ లోకేశ్ లా మొద్దబ్బాయిలు కాదు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు





ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. నారా లోకేశ్ లా గ్రామ వాలంటీర్లు మొద్దబ్బాయిలు కాదంటూ ఎద్దేవా చేశారు. 'గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట. ఇవి చంద్రబాబు చేసిన కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు లోకేశ్ లా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి.. ఆయన కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.

'ఎవరిచ్చారు మీకీ అధికారమంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఒక కమెడియన్ తరహాలో కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి పెట్టినట్టున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా లేదు' అని ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.