Skip to main content

క్రికెట్ మ్యాచ్ చూడడానికి రండి.. మోదీ, షేక్‌ హసీనాలను 'క్యాబ్‌' ఆహ్వానం

వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం బంగ్లాదేశ్‌ కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని క్యాచ్ నిర్ణయించింది.

 క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈడెన్‌లో గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను క్యాబ్‌ ఆహ్వానించింది. ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్‌లో మొహాలీలో జరిగిన మ్యాచ్ కు అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరై మ్యాచ్ ను చూసిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...