పట్టపగలు నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ రోడ్డులో వెళ్తుండగా అటకాయించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. అతని వద్ద ఉన్న 15 కాసుల బంగారం, రూ.2 లక్షలను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment