Skip to main content
 టీవీ9 రవిప్రకాశ్‌పై మరో కేసు
టీవీ9 రవిప్రకాశ్‌పై మరో కేసు
చానల్ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల పోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై  మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్‌ కింద సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చంచల్గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్‌తో మియాపూర్‌ కోర్టుకు తీసుకెళ్లారు.
ఏబీసీఎల్‌ నుంచి అక్రమంగా నిధులు తీసుకుంటున్నట్లు రవిప్రకాశ్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.రవి ప్రకాశ్‌తోపాటు టీవీ9లో పనిచేసిన మరో ఉద్యోగి కేవీఎన్‌ మూర్తిపైనా అలందా మీడియా ఫిర్యాదు చేసింది. ఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోవడంతోపాటు, కీలక పత్రాలు ఫోర్జరీకి సంబంధించిన కేసులో గతంలోనూ పోలీసులు రవిప్రకాశ్‌ను విచారించారు.

Comments