వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment