Skip to main content

అనూహ్యరీతిలో తెరపైకి గంగూలీ పేరు.... బీసీసీఐ అధ్యక్ష పదవికి ముంబయిలో నామినేషన్ దాఖలు

 



టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం లాంఛనమే. కొద్దిసేపటి క్రితమే ముంబయిలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నది గంగూలీ ఒక్కరే. బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 తుది గడువుగా విధించారు. వాస్తవానికి కర్ణాటకకు చెందిన బ్రిజేశ్ పటేల్ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయమని నిన్నటివరకు అందరూ భావించారు. కానీ, కొన్నిగంటల్లోనే పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బీసీసీఐ చీఫ్ రేసులో ముందు నిలిచాడు.

ఇక, ఇతర పదవుల విషయానికొస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శి పదవికి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారి పదవికి, కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయేశ్ జార్జ్ సంయుక్త కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, గంగూలీ రాకతో రేసు నుంచి తప్పుకున్న బ్రిజేశ్ పటేల్ ను ఐపీఎల్ చైర్మన్ గా చేసేందుకు పావులు చకచకా కదులుతున్నాయి   

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.