తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, గంగుల కమలాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ పదోరోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పలు ఆందోళనలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బైఠాయింపు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Post a Comment