ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య కానీ… వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఎద్దేవా చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి.
తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని, కేసీఆర్ కి అంత పెద్ద మనసు లేదని అన్నారు.
ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే… బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని అన్నారు విజయశాంతి.
Comments
Post a Comment