Skip to main content

కోడెల ఆత్మహత్య కేసు విచారణ... కీలక విషయాలు చెప్పిన శివరామ్

కోడెల ఆత్మహత్య కేసు విచారణ... కీలక విషయాలు చెప్పిన శివరామ్



ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తండ్రి అపరకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున ఇప్పుడే తాను రాలేనని, కొంత సమయం కావాలని కోడెల కుమారుడు శివరాం పోలీసులను కోరారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంని విచారణకు పిలిపించారు.

విచారణకు హాజరైన శివరాం తన తండ్రి శివప్రసాదరావు కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తండ్రితో ఎలాంటి విభేదాలు లేవని, అంతా కలిసే ఉంటామని పోలీసులకు శివరాం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే రోజుకు ముందే తాను విదేశాలకు వెళ్లానని, కుటుంబ సభ్యులు చెప్తేనే తనకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందని శివరాం చెప్పినట్లు సమాచారం. కోడెల శివప్రసాదరావు భార్య నుంచి కూడా హైదరాబాద్ పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. ఒత్తిడి కారణంగానే తన భర్త చనిపోయారని కోడెల భార్య చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసులకు ఎన్నడూ కోడెల భయపడలేదని, ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునేలా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...