ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. తన సతీమణి
సురేఖతో కలసి వచ్చిన చిరంజీవికి జగన్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు.
అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. విందు భోజనం ఆరగించారు. ఈ
సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు. 'సైరా'తో
చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు. 'చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో
జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.
Comments
Post a Comment