Skip to main content

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద


కర్ణాటక ఎగువ ప్రాంతంలోని కృష్ణ పొంగి ప్రవహించడంతో శ్రీశైల జలాశయం కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం కు ఇన్‌ఫ్లో లక్ష.42.435 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుని నిండు కుండలా మారింది.

డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 7 పాయింట్లు, నాలుగు టీఎంసీలు మాత్రమే తక్కువగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం శనివారం ఉదయం కు 884.30 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదయ్యాయి.

శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 45,439 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 24345 క్యూసెక్కులు, సుంకేసుల మీదుగా రోజా నుంచి తుంగభద్రకు 75 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

Comments