తూర్పు గోదావరి జిల్లా... కచ్చులూరు దగ్గర ప్రవాహం దాటికి నీటిలో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు మళ్లీ ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. ఈ ఉదయం క్రేన్లు, సరంజామాతో వచ్చిన నిపుణులు... ఇనుప వైర్లను గోదావరిలోకి వదులుతున్నారు. నిజానికి ముంబై నుంచీ వచ్చిన ఓ టీమ్... అత్యాధునిక టెక్నాలజీతో బోటును వెలికి తీయాలని నిర్ణయించి... తీరా అది సాధ్యం కాదని చెప్పి... తిరిగి వెళ్లిపోయింది. ఇందుకు కారణం... బోటు 200కు పైగా ఆడుగుల లోతున ఉందని భావించడమే. ఐతే... ధర్మాడి సత్యం టీమ్‌కి ఇలాంటి పడవల్ని బయటకు తీసిన అనుభవం ఉండటంతో... ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ బృందం క్రేన్లకు ఇనుప వైర్లు కట్టి... ఆ వైర్లకు యాంకర్ వేసి... నీటిలోకి వదులుతోంది.
లంగర్‌కి బోట్ తగిలితే... బయటకు లాగాలన్నది ప్లాన్. ఐతే... బోటు పూర్తిగా బురదలో కూరుకుపోయినట్లు తెలిసింది. ప్రమాదం జరిగి... నెల కావడంతో... ఇప్పుడా బోటును బయటకు లాగితే... అది బురదలో పూర్తిగా నానిపోయి... ముక్కలైపోతుందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ బోటును బయటకు తీసి తీరతామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది.
వారం కిందట కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి... తీరా గోదావరి ఉద్ధృతి పెరగడంతో... పనికి తాత్కాలిక బ్రేక్ వేసింది నిపుణుల బృందం. ఇప్పుడు పై నుంచీ వస్తున్న వరద నీరు తగ్గడంతో... బోటును బయటకు తీసేందుకు వీలుగా ఉండటంతో... మళ్లీ ప్రయత్నిస్తున్నారు.
Comments
Post a Comment