Skip to main content

చంద్రబాబును టార్గెట్ చేసిన‌ బీజేపీ




టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసింది. ఈ మేరకు అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు బాబుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని, దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని, పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. 

Comments