Skip to main content

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో తప్పిన ప్రమాదం!

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. స్థానిక అర్జునవీధిలో దుర్గ గుడి ప్రసాదం పులిహోర తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకైన విషయం పసిగట్టిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గ్యాస్ వాల్వ్ ను కట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రసాదం తయారీ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రసాదం తయారీ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. గ్యాస్ లీకైన సమాచారం మేరకు దుర్గగుడి ఈవో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

కాగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది. మహామండపంలోని ఆరో అంతస్తులో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నగరోత్సవం నిర్వహించనున్నారు.

Comments