Skip to main content

హౌడీ-మోదీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్: ప్రధాని మోదీ



భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, తన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడికి తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగొచ్చిన సందర్భంలో ఈ ఘనస్వాగతం మరువలేనిదని పేర్కొన్నారు.

2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఓసారి ఐక్యరాజ్యసమితికి వెళ్లానని, ఇప్పుడు మరోసారి వెళ్లానని, ఈ ఐదేళ్లలో పెద్దమార్పు చూశానని మోదీ వివరించారు. అమెరికాలో నిర్వహించిన హౌడీ-మోదీ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. హూస్టన్ లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా దేశప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Comments