Skip to main content

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండగే పండుగ

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండుగ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల లోపే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు చాలావరకు అక్టోబర్ నెలలో అమలు కానున్నాయి. సమూల మార్పులు దిశగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇచ్చిన హామీల ప్రకారం అక్టోబర్ నెలలో ఏపీలో పండుగ వాతారణం నెలకొల్పేలా చేస్తున్నది.

ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. మొదటగా అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసలు ఆ పేరే వినిపించకుండా.. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా.. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా జగన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది.

తద్వారా బెల్ట్‌ షాపులు లేకుండా చేసి మద్యం అమ్మకాలను తగ్గించి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం కోరిక. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్‌ షాపులకు తెర పడదు. అందుకే ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

అలాగే ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన "అన్న క్యాంటీన్లు" వైఎస్ఆర్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవనున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 2వ తేదీనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఇక అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు సాయం అందించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సొంతంగా ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్ల నడుపుకునే వారికి చేయూతను ఇస్తోంది ఈ పథకం. అక్టోబర్‌ 4వ తేదీనే సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ సాయం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆఫ్ లైన్‌, ఆన్‌ లైన్‌‌లతో పాటు నేరుగా మొత్తం ఇందుకోసం 1,75,218 దరఖాస్తుల వచ్చాయి.

అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రతీ ఇంట్లోని వ్యక్తులకు కంటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయబోతున్న కార్యక్రమం 'వైఎస్ఆర్ కంటి వెలుగు'. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.560 కోట్లు కేటాయించింది. 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందిస్తారు.

ఇక జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకుని వచ్చిన మరో పథకం 'వైఎస్ఆర్ రైతు భరోసా' ఈ పథకం ద్వారా రూ.12వేలు రైతులకు అందించనుంది ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అక్టోబర్ 15న అమలు కానుంది. 

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.