Skip to main content

చంద్రబాబు, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికపై ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడ్‌విట్‌లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి ముఖ్యమంత్రిగా జీతం తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పొందుపరచలేదని వివరించారు.

Comments