నేటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 8 వరకు కొనసాగనున్నాయి. పది అవతారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీ భక్తులకు ప్రత్యేక దర్శన సమయాలు కేటాయించారు.
ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్ రేపు సమర్పించనున్నారు.

Comments
Post a Comment