ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అన్నారు. విద్యుత్ రంగాన్ని సరిదిద్దేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. అయితే, గత ప్రభుత్వం చేసిన పొరబాట్లు తమకు గుదిబండలుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ వస్తున్నామని బాలినేని తెలిపారు. 2019 మార్చి నాటికి రూ.20,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలన్నింటికి చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నామని ఆయన వివరించారు.

Comments
Post a Comment