బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా వల్ల కన్నుమూశారు. కరోనా
బారిన పడిన ఆయన... నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స
తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి
గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ
దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు
దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Comments
Post a Comment