విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్‌గ్రీడియంట్స్ (ఏపీఐ) దిగుమతులపై భారత ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది.
ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.
ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐ), ఏపీఐల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఔషధ పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ)పథకాన్ని ఇటీవల డీఓపీ ప్రకటించింది. ప్రస్తుతం చైనాపై ఎక్కువగా ఆధారపడిన 53 కీలకమైన ఏపీఐలతో సహా 41 ఇతర ఉత్పత్తులకు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి భారతీయ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment