Skip to main content

మోహన్ బాబు ఇంటి ముందు ఆగంతకుల హల్ చల్



సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ఈ సాయంత్రం కొందరు ఆగంతకులు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది.

ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో వున్న ఓ ఇన్నోవా కారు నగర శివార్లలో వున్న మంచు మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చింది. ఆ సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంతా జిమ్ లో వుండి వర్కవుట్ లు చేస్తున్నారు. ఇన్నోవా కారు కావడంతో, గార్డ్ కొత్తవాడు కావడంతో గేటు తీసి లోపలకు వదిలినట్లు బోగట్టా.

కారు తిన్నగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత అందులోంచి దిగిన ఆగంతకులు గట్టిగా కేకలు వేసి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం లాంటి కేకలు వేసినట్లు బోగట్టా. కారులో వచ్చిన వారు కాస్త మద్యం సేవించి వున్నట్లు తెలుస్తోంది. ఇలా కాస్సేపు కేకలు వేసాక, వాళ్లంతట వాళ్లే కారులోకి ఎక్కడి, రివర్స్ చేసుకుని స్పీడ్ గా వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ మేరకు మోహన్ బాబు పోలీసులుకు విషయం వివరించారని, ఫిర్యాదు చేయబోతున్నారని, సిసి ఫుటేజ్, కారు నెంబర్ అన్నీ వున్నాయని తెలుస్తోంది

Comments