కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. కోవిడ్ కారణంగా థియేటర్లు కూడా ఓపెన్ కాకపోవడంతో.. దర్శక నిర్మాతలందరూ ఓటీటీ వేదికలగానే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలను కూడా రిలీజ్ చేశారు. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. కాగా ఇక ఈ మధ్యే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోకి వచ్చిన ‘ఆహా యాప్’ కూడా మంచి స్పందన లభిస్తుంది.
తాజాగా మరో కొత్త సినిమా ఆహా యాప్‌లో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నటి జ్యోతిక నటించిన ‘మగువలు మాత్రమే’ అనే చిత్రం ఆగష్టు 7వ తేదీన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా యాప్‌లో విడుదల కాబోతంది. ఇటీవలే జ్యోతిక ప్రముఖ పాత్రలో నటించిన ’36 వయసులో’ సినిమా కూడా ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మగువలు మాత్రమే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఊర్వశి, నాజర్, భాను ప్రియ, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు గిబ్రన్ సంగీతం అందించారు.
Comments
Post a Comment