Skip to main content

అప్పుల అంబానీ రఫేల్ డీల్ తో కోలుకుంటారా?

  


భారత దేశానికి ఫ్రాన్స్ దేశం తయారు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై మరోసారీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  లిమిటెడ్ ను తన ఆఫ్ సెట్ భాగస్వామిగా చేసుకుంది. దీనిపై దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

దేశ రక్షణ రంగానికి విమానాలు తయారు చేసే ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ ఉండగా దివాలా తీసిన అంబానీ సంస్థతో ఏకంగా దస్ ఏవియేషన్ రూ.30000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తన దగ్గర ఏవీ లేవని.. దివాళా తీశానని ఓ కేసులో లండన్ కోర్టులో రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీ చేతులెత్తేశారు. మరి ఈ కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు.? ఎందుకు ఇందులో చేర్చుకున్నారన్నది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అవినీతే అని.. ఇందులో మోడీ సర్కార్ కుంభకోణం చేసిందని ఆరోపించాయి.

అయితే రఫేల్ డీల్ తో 30వేల కోట్ల నిధులు అనిల్ సంస్థలోకి చేరాయి. మరి ఈ కోట్లతోనైనా అనిల్ సంస్థ నిలబడుతుందా? వేల కోట్ల అప్పులపాలై దివాళా తీసిన అనిల్ ను రక్షిస్తుందా అంటే లేదు అని ఆర్థిక నిపుణులు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Comments