Skip to main content

ఇక హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫికేషన్ తప్పనిసరి!



ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలకు గురికాకుండా, తప్పనిసరిగా బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్లను తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దీనిపై ఆసక్తిగలవారు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపింది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, 2016 ప్రకారం తప్పనిసరిగా ద్విచక్ర వాహనాల రైడర్ కోసం రక్షణ హెల్మెట్లను తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే లోకల్ హెల్మెట్లను ధరించే ద్విచక్ర వాహనదారులు చలానా చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లనే తయారు చేసి, భారత దేశంలో విక్రయించవలసి ఉంటుంది. బీఐఎస్ సర్టిఫైడ్ కానటువంటి హెల్మెట్లను తయారు చేసే కంపెనీల యాజమాన్యాలు కూడా జైలు శిక్ష, జరిమానాలకు పాత్రులవుతారు.

Comments