ఫ్రీగా డేటా బ్యాక్‌అప్’ను గూగుల్ ప్రకటించింది. క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ ‘గూగుల్ వన్’ ఇక మీ ఐఓఎస్ (IOS), ఆండ్రాయిడ్ ఫోన్‌లోని డేటాను ‘ఫ్రీగా బ్యాక్‌అప్’ చేయనుంది. ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే ‘డేటా బ్యాక్‌అప్’ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్ ఇందులో మార్పులు చేసింది.ఇప్పుడు ఐఓఎస్ (IOS), ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని డేటాను గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంది. ఐఓఎస్(IOS) యాప్ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను బ్యాకప్ చేస్తుంది. ఇప్పటికే బ్యాకప్ చేయగల ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇప్పుడు ‘గూగుల్ వన్’ రిజిస్టేషన్లే లేకుండా బ్యాకప్‌ను అందిస్తుంది.
బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్ అయిన ఫైల్‌ల నిర్వహణను ‘గూగుల్ వన్’ వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ భద్రపరుచుకునే సౌకర్యాన్ని మొబైల్స్‌తోపాటు వెబ్ ‘ప్లాట్‌ఫామ్’లకు అవకాశం ఇచ్చంది. జీ మెయిల్(gmail), ఫోటోలు, డ్రైవ్ నుంచి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
Comments
Post a Comment