తనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లనని.. గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో సుమారు రూ.700కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తలసాని తెలిపారు. నాటి సీఎం డాక్టర్ చెన్నారెడ్డి సైతం సనత్ నగర్ నుంచి గెలిచి ఇంతలా చేయలేదని వివరించారు.
ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు.. పట్టణ ఆరోగ్యకేంద్రాలు బస్తీ దవాఖానాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించేలా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Post a Comment