Skip to main content

పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి



విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జరిగిన సభలో పవన్ అనుభవలేమి, అజ్ఞానం బయటపడ్డాయని, పవన్ ఓ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులు కాలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్ కల్యాణ్ ఓ సినిమా ఉచితంగా చేశాననుకుని ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవచ్చు కదా అని హితవు పలికారు.

పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికే పరువు కోల్పోయిన పవన్, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ద్వారా మరింత దిగజారిపోతున్నాడని విమర్శించారు. పవన్ ఇంకా సినిమా మాయలోనే ఉన్నాడని, వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కేవలం 2 కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని, కానీ సీఎం జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...