తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. వారి ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.
టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని అసంతృప్త కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించింది. ఆయనను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. దీంతో ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించింది. ఓ ప్లాట్‌ఫాం కోసం ఎదురుచూస్తున్న మోత్కుపల్లి కూడా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల ఆహ్వానాన్ని మన్నించినట్టు సమాచారం.
Comments
Post a Comment