ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ
వ్యవహారంపై స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా బదిలీ చేయడం
దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీఎస్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి
ఉన్నా గానీ, ఇలా జరిగివుండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. హిందూ
దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించినందుకు
ప్రతిఫలంగానే సీఎస్ ను బదిలీ చేసినట్టయితే మరీ దారుణం అని భావించాల్సి
ఉంటుందని తెలిపారు. బాధ్యత లేకుండా అధికారం చెలాయించే సీఎం కార్యాలయం
ముఖ్యమంత్రుల మెడకు ఉచ్చులా మారుతోందని వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment