ఇటీవల సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన 'సైరా' తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి సమర్థవంతంగా తెరకెక్కించాడంటూ ప్రశంసలు దక్కాయి. అలాంటి సురేందర్ రెడ్డి ఇక తనదైన స్టైల్లో ఒక కథను సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇదే నేపథ్యంలో ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ దిశగా దిల్ రాజు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. ప్రభాస్ హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగా .. సురేందర్ రెడ్డి మార్క్ స్టైలీష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Post a Comment