Skip to main content

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?.. సాయంత్రం గవర్నర్ తో భేటీ

 


మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు ఈ రోజు సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారు.

వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. ఇటీవల శివసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సంజయ్ రౌత్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.