ఏపీలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో ఆయన ఆదివారం భారీస్థాయిలో లాంగ్ మార్చ్ నిర్వహించి ఇతర రాజకీయ పక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే, మరో రెండు వారాల్లో అమరావతిలో పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనిపై జనసేన మీడియా విభాగం శతఘ్ని వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని, జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వచ్చిన సమాచారమే అధికారికం అవుతుందని శతఘ్ని వెల్లడించింది.
జనసేన ఫేక్ అని చెబుతున్న ప్రెస్ నోట్ ఇదే...
Comments
Post a Comment