ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోందని, అన్ని నదులు
వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం
61 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు
వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా
నడిచిందని... ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ
నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య
తాత్కాలికమేనని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మర్గదర్శకాలను రూపొందించామని
చెప్పారు.
Comments
Post a Comment