ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతుండడంపై ఏపీ బీజేపీ సహ ఇన్‌చార్జ్
సునీల్ దేవ్‌ధర్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో రూ. 70 వేల కోట్ల విలువైన
డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హయాంలో ప్రకటించిన
ఆదానీ గ్రూప్, రూ.15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు
తాజాగా ఏపీ నుంచి తరలిపోవడంపై సునీల్ దేవ్‌ధర్ తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీ
రాష్ట్ర సొంత ఆదాయం జీతాలకు, అప్పుల వడ్డీలకే సరిపోవడం లేదన్నారు.
సంపాదించిన సొమ్మును నవరత్నాలకు ఖర్చు చేయాలని, అప్పులు చేసి కాదని ఆయన
విమర్శించారు. రాష్ట్రంపై రూ. 3.5 లక్షల కోట్ల మేర అప్పుల భారం ఉందని ఆవేదన
వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ మేలుకుంటే మంచిదని దేవ్‌ధర్ ట్వీట్
చేశారు.
Comments
Post a Comment