Skip to main content

పవన్ కల్యాణ్ ఓ 'ప్యాకేజీ స్టార్': లాంగ్ మార్చ్ పై విజయ సాయిరెడ్డి సెటైర్లు




ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత సమస్యపై నిరసన తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్... విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి... పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేశారు.

'చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ప్యాకేజీ స్టార్. రాజకీయాల్లో ‘కాల్షీట్’ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయతీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి చూడొద్దట. ఈ మాట ప్రజలను అడుగుతున్నావా?' అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 2.5 కి.మీ.మేర  ఇది కొనసాగింది. అయితే, కేవలం 2.5 కి.మీ.మేర చేసిన మార్చ్ కు లాంగ్ మార్చ్ అంటూ పేరు పెట్టడంపై కూడా విజయ సాయిరెడ్డి నిన్న సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

Comments