Skip to main content

ఆర్టీసీ కార్మికుల తొలగింపు సరైనది కాదు.... పవన్ కళ్యాణ్


తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకోవాలని పరిశీలించాలని అంతేగాని కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచించారు
credit: third party image reference
ఈ మేరకు జనసేన పేరుతో సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నేపథ్యంలో 48 వేల ఆరు వందల అరవై మంది ఉద్యోగుల్లో 1,200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించడం ఉన్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు
credit: third party image reference
అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలు మనం పాటించి చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా నిలిచారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.