ప్రభుత్వం కొత్తగా తీసుకు రానున్న రైతు భరోసాలో ఒక రైతు తనకున్న భూమిని ఎంతమందికి కౌలుకు ఇచ్చినా కేవలం ఒక రైతుకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయాలని నిర్ణయించడంపై రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇది కౌలు రైతులను దెబ్బతీసి, పథకం నుంచి తప్పించడమేనని పేర్కొన్నాయి. భూయజమానుల కన్నా కౌలు రైతులే ఏపిలో ఎక్కువగా ఉన్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పక్కకు నెట్టినట్టు కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతు భరోసా క్రింద 12500 పెట్టుబడి సాయంగా అందించాలని జగన్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ నిర్ణయించిన విషయం విదితమే. అయితే ఇందులో ప్రధాని కిసాన్‌సమ్మాన్ క్రింద రైతులకు 6000 కేవద్ర సాయం అందుతుండటంతో దానికి మరి 6500 మాత్రమే కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే భూమలేని కౌలు రైతులకు రూ. 12500 అందిస్తామని ప్రభుత్వం చెపినా తాజా నిబంధనలతో ఆ సాయం హుళక్కే అనిపిస్తోంది. ఎందుకంటే కౌలు ఒప్పంద పత్రాలు ఖచ్చితం అన్న నిబంధనే కారణంగా కనిపిస్తోంది. కౌలుకు ఇచ్చేవారు దాదాపు రాత కోతలకు దూరంగా ఉంటారని, ఈ స్థితిలో పత్రాలెక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్న కౌలు రైతుల నుంచి వినిపిస్తోంది.
ఇక కిసాన్ సమ్మాన్‌పై విచారణ చేసిన ప్రభుత్వం ఆధార్ ఆధారం చేసుకుని అనేక మందిపై వేటు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకున్న భూములకు రైతు భరోసా అందకుండా పోయేలా ఉందని, ఉద్యోగులు తమకున్న భూములు దాదాపు కౌలుకే ఇస్తారని రైతు సంఘాల వాదన.
మరోవైపు రైతు భరోసా క్రింద 85లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా వారిలో దాదాపు50 లక్షల కుటుంబాలని గుర్తించారు. మరి 3 వేల కుటుంబాలు పరిశీలినలో ఉండగా, ఆరు లక్షల మంది పైచిలుకు రైతు కుటుంబాల వివరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీరిలో సోమవారం వరకు లో ఇప్పటి వరకు 40 వేల మంది కౌలు రైతులకు మాత్రమే పంటసాగుదారుల ఒప్పంద ప్రతాలు రిజిస్ట్రేషన్ శాఖ అందించింది. ఇక అటవీ చట్టం ప్రకారం 61 వేల పైచిలుకు గిరిజనులున్నట్టు తెలుస్తోంది.
అలాగే 7లక్షల మంది భూ యజమానులు మరణించారని, వారి వారసులు తగిన ఆధారాలతో భూమిని తమ పపేరున మార్చుకుంటే రైతు భరోసా అందుతుందని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. ఏదిఏమైనా ఈ నెల 15న ఆరంభం కానున్న ఈ కార్యక్రమం ఒడిదుడుకులు అధిగమించి రైతాంగానికి బాసటగా నిలవాలని జనం కోరుకుంటున్నా
Comments
Post a Comment