Skip to main content

ఫ్రాన్స్ లో నేడు రాజ్ నాథ్ సింగ్ ఆయుధపూజ... తొలి రాఫెల్ జెట్ వాయుసేనకు

భారత వాయుసేనను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్న రాఫెల్ తొలి జెట్ నేడు డెలివరీ కానుంది. ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేడు ప్రత్యేక ఆయుధపూజలను జరిపిన అనంతరం తొలి యుద్ధ విమానాన్ని డెలివరీ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాజ్ నాథ్, ఫ్రాన్స్ కు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇండియాకు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య స్నేహబంధం కొనసాగుతుందని చెప్పారు.

కాగా, నిన్న రాజ్ నాథ్, రాజధాని ఫ్రాన్స్ లోని ఎలిసీ ప్యాలెస్ లో మార్కన్ తో చర్చలు జరిపారు. గడువులోగా మిగతా అన్ని యుద్ధ విమానాలనూ డెలివరీ ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ కోరారు. ఇక, నేడు ఐఏఎఫ్ 87వ వార్షికోత్సవం కాగా, ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్, ధైర్యానికి, అంకితభావానికి వాయుసేన నిదర్శనమని, దేశానికి సేవ చేస్తున్న వాయుసేన కుటుంబానికి శుభాకాంక్షలని అన్నారు.   

Comments