విజయదశమి సందర్భంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రావణవధ
కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పండుగల పుణ్యభూమి అని, ఏడాది
పొడవునా ఎక్కడో ఒక చోట ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. మన
పండుగలన్నీ ప్రజలను ఒకచోట చేరుస్తాయని, వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయని
అన్నారు. వేల ఏళ్ల సంస్కృతి, పరంపరతో ప్రజల జీవితం ముడిపడి ఉందని మోదీ
పేర్కొన్నారు.
మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందని తెలిపారు. భారత్ రోబోలను రూపొందించదని, మనుషుల్ని తయారుచేస్తుందని వ్యాఖ్యానించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సామూహిక శక్తి అనిర్వచనీయం అని, రాముడు సామూహిక శక్తితోనే వారధి నిర్మించి లంక చేరుకున్నాడని వివరించారు. దసరా వంటి ఉత్సవాలు ప్రజలకు అలాంటి సామూహిక శక్తినే అందిస్తాయని అన్నారు.
Comments
Post a Comment