విశాఖపట్నం జిల్లా కశింకోట సమీపంలో రైలు పట్టాలు విరగడంతో, విజయవాడ - విశాఖ
మధ్య నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న
అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పట్టాలను సరిచేసే పనిలో
పడ్డారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను
నిలిపివేశారు. వీటితో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు గంట నుంచి
రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నానికి పట్టాలను సరిచేస్తామని
అధికారులు వెల్లడించారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment