నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రావణ
దహనం కార్యక్రమం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లో గత కొన్ని
రోజుల నుంచి నిత్యమూ వర్షాలు కురుస్తూ ఉండటంతో, రావణాసురుడు తడవకుండా
రెయిన్ కోట్ వేసేశారు. ఈ ఘటన ఇండోర్ లోని జిమన్ బాగ్, రామ్ బాగ్ తదితర
ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రావణాసురుని వాటర్ ప్రూఫ్ ను చేశారు. ఎంత వర్షం
పడినా దహన కార్యక్రమం వరకూ రావణుడు తడవకుండా ఉండేందుకు ఇటువంటి ఏర్పాట్లు
చేశామని, ప్రతిమలకు రెయిన్ కోట్లు వేశామని నిర్వాహకులు తెలిపారు. ఇండోర్,
ఉజ్జయిని ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ
అధికారులు హెచ్చరించడంతో పలు ప్రాంతాల్లో రావణ ప్రతిమలకు ప్లాస్టిక్
కవర్లను కప్పి ఉంచారు.
Comments
Post a Comment