గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు. పార్థసారథి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్థసారథిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకం ఉంచి ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు.
అయితే కొంతకాలంగా పార్థసారథి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్థసారథి ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

Comments
Post a Comment