ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు విమర్శలు గుప్పించారు. సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని అడిగారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇటీవలే అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment