Skip to main content

పాకిస్థాన్ ఖాతాలో మరో అవమానం... నిజాం సంపదపై బ్రిటన్ కోర్టు కీలకతీర్పు

ఇటీవల కాలంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఏదీ కలిసిరావడంలేదు. ఐక్యరాజ్యసమితిలోనూ, అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ భారత్ వాదనలకే మొగ్గు కనిపిస్తోంది. తాజాగా, 70 ఏళ్ల నాటి నిజాం సంపద కేసులో కూడా పాక్ కు పరాభవం తప్పలేదు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే... 1948లో 7వ నిజాం పేరు మీద లండన్ లోని ఓ బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల నగదు డిపాజిట్ అయింది. నిజాం అప్పట్లో బ్రిటన్ లో పాక్ రాయబారి హబీబ్ ద్వారా ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయించారు.

అయితే ఆ నగదు తమకే చెందుతుందని నిజాం వారసులు ముఖరం ఝా, ముఫకం ఝా వాదిస్తుండగా, అప్పట్లో తాము నిజాంకు ఆయుధాలు సరఫరా చేశామని, అందువల్ల ఆ సొమ్ము తమకే చెందాలని పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ కేసులో నిజాం వారసులకు భారత్ దన్నుగా నిలిచింది. గత 70 ఏళ్లుగా ఈ కేసు హైకోర్టు ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో విచారణలో ఉంది. హబీబ్ కూడా నిజాం తనపై నమ్మకంతోనే ఆ నగదు పంపారని గతంలోనే చెప్పారు.

ఎన్నో దశాబ్దాల పాటు సాగిన విచారణలు, వాదోపవాదాల దరిమిలా బుధవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సంపద నిజాం వారసులకే చెందాలని, పాక్ కు దీనిపై హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో ఉన్న ఈ నగదు త్వరలోనే నిజాం వారసుల పరం కానుంది

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here