2020 జూలైలో అంగారకుడిపైకి మిషన్ మార్స్ రోవర్ ను పంపబోతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అక్కడికి పంపే రోవర్ లో ఓ మైక్రోచిప్ ను అమర్చింది. ఆ చిప్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను నిక్షిప్తం చేసింది.
ఈ చిప్ లో పేర్లను నిక్షిప్తం చేయడానికి ‘సెండ్ యువర్ నేమ్ టు మార్స్ ’అని నాసా సెప్టెంబర్ 30వరకు పేర్లను ఆహ్వానించింది. ఇందులో కోటిమందికి పైగా ప్రజలను పేర్లను పంపారు. నేషనల్ మిషన్ ఆఫ్ మాన్యస్ర్కిప్ట్ మాజీ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి నాసా వెబ్ సైట్ లో శ్రీవారి పేరును ప్రతిపాదించారు.వీటిలో అత్యధికంగా ప్రతిపాదించిన ‘తిరుమల శ్రీవేంకటేశ్వరుని’ పేరును నాసా ఎంపిక చేసింది.
దీంతో ఇప్పుడు అంగారక గ్రహంపై పంపే రోవర్ లో శ్రీవారి పేరును నాసా నిక్షిప్తం చేసింది. మన తిరుమలేషుడు పేరు ఇప్పుడు అంగారక గ్రహంపై వెళ్లనుందన్నమాట.. గ్రహాలు దాటి వెళుతున్న శ్రీవారి అద్భుతం చూడాలంటే మనం 2020 జూలై వరకూ ఆగాల్సిందే..

Comments
Post a Comment