Skip to main content

ఏపీపీఎస్సీ పనితీరుపై కీలకవ్యాఖ్యలు చేసిన బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తన నియోజకవర్గంలో స్థానిక సచివాలయాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పనితీరుపై విమర్శలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ గనుక పరీక్షలు నిర్వహించి ఉంటే ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పట్టేదని అన్నారు. ఎప్పుడు నియామకాలు పూర్తిచేస్తారో వారికే తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగలేదని తెలిపారు. సచివాలయ నియామకాలపై విపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.

Comments