ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం జగన్ పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్త్రీ జాతినే అవమానించినోడికి ఇటువంటివో లెక్కా అంటూ విమర్శించారు.
Comments
Post a Comment