Skip to main content

మహాత్ముడికి మోదీ నివాళి



దేశ వ్యాప్తంగా గాంధీ 150వ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్‌ఘాట్‌లో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లో మోదీ నివాళి అర్పించారు. కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
శాంతి, సేవకు మార్గాన్ని చూపిన గొప్ప దార్శనికుడు జాతిపిత మహాత్మాగాంధీ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ప్రపంచానికి వెలుగు చూపిన వ్యక్తి మహాత్ముడుంటూ కొనియాడారు. రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను కొనియాడారు.

Comments